ఇకపై బార్లలో మహిళలు పనిచేయొచ్చు..

bar-21-.jpg

ఇకపై బార్లలో మహిళలు పనిచేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బార్లలో మహిళలు పనిచేసేందుకు అనుమతించే బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బెంగాల్ ఎక్సైజ్ యాక్ట్- 1909ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఈ చట్టం ఆటంకంగా మారిందని బెంగాల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య అభిప్రాయ పడ్డారు. ఈ చట్టం వివక్షతతో కూడుకున్నదని అందుకే చట్ట సవరణ చేసినట్టు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల్లో ఆడ, మగ అని విబేధాలు తమ ప్రభుత్వానికి లేవని అన్నారు.

Share this post

scroll to top