సాధారణంగా కుంకుమ పువ్వును గర్భిణీలు ఎక్కువగా తీసుకుంటారు. అయితే దీన్ని గర్భిణీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా తీసుకోవచ్చు. దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని స్త్రీ,పురుషులు ఇద్దరు కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. గుండెపోటును నివారించడంమే కాకుండా కాలేయా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. కుంకుమపువ్వులో అధిక శాతం యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను పెంచకుండ సహాయపడుతుంది. హానికరమైన క్యాన్సర్ కణాలను నివారించడంలో కుంకుమపువ్వు ఎంతో మేలు చేస్తుంది. ఆకలి తగ్గించి బరువును అదుపు చేయడంలో కుంకుమ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో కుంకుమ పువ్వు తన వంతుగా ఎంతో సహాయపడుతుంది.
కుంకుమ పువ్వును గర్భిణీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా తీసుకోవచ్చు..
