నానబెట్టిన ఎండుద్రాక్ష నీరే కదా అని పారేస్తున్నారా?

Raisin-water.jpg

నానబెట్టిన ఎండు ద్రాక్ష ఎంత పోషకమైనదో.. నీరు కూడా అంతే. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు డిటాక్స్ వాటర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నీరు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

నానబెట్టిన ఎండుద్రాక్షను ఎప్పుడూ పారేయకండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ నీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని డిటాక్స్ వాటర్‌గా తాగడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. శారీరక మంట తగ్గుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బరువును తగ్గిస్తుంది.

ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు శరీరంలో పేరుకుపోయిన అన్ని కాలుష్య కారకాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. 10-15 ఎండుద్రాక్షలను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్షను తినండి. దానితో ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తాగండి.

Share this post

scroll to top