సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కాస్త గట్టిగానే వాయిస్ పెంచారు. ఏమన్నారంటే ప్రధానమంత్రి మోదీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితుల దగ్గర బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తర్వాతి రాజకీయ మజిలీ బీజేపీయే. త్వరలోనే రేవంత్ రెడ్డి, బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం. తాను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి? ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి” అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి కి మోదీ అంటే ఎందుకు భయం..
