యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది వయ్యారి భామ శ్రియ. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో స్టార్ హీరోలు కూడా ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు అప్పట్లో అంత బిజీగా గడిపింది శ్రియ. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. నటనతో పాటు అందంలోనూ ఈ అమ్మడు అదరగొట్టింది. ఇక ఇప్పుడు నాలుగు పదుల వయసులోనూ శ్రియ తన అందాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శ్రియ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
ఇప్పుడు మరోసారి శ్రియ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో శ్రియ నటిస్తుందని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ టాప్ హీరో సూర్య. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో శ్రియ నటిస్తుందని తెలుస్తుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.