కోటి ఆశలతో పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి పిల్లల కోసం కుటుంబం కోసం ఎంతో కష్టపడి తిరిగి మళ్లీ స్వదేశానికి వస్తున్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విజయవాడ మార్గమధ్యంలో బస్సులో తుది శ్వాస విడిచారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి విషాద ఘటన ఏపీలో తాజాగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చింది. విజయవాడ నుంచి స్వస్థలానికి బస్సులో బయల్దేరింది. గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
బస్సులోనే గుండెపోటుతో మహిళ మృతి..
