జమిలీ ఎన్నికలపై పార్టీ నేతలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కీలక సూచనలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు అంటున్నారని, పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని కమిటీలు పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించారు. ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదని, సమస్యలపై పోరాటాలు చేయాలని చెప్పారు. అన్యాయాలపై ధర్నాలు, నిరసనలు తెలిపాలని, బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. అలా చేస్తేనే ప్రజల్లో ఉధృతమైన స్పందన వస్తుందన్నారు. కష్టపడిన వారికి పార్టీలో అవకాశాలు లభిస్తాయని జగన్ పేర్కొన్నారు.
జమిలీ ఎన్నికలపై జగన్ కీలక సూచనలు..
