ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం రోజుకు రోజుకు ముదురుతోంది. వైసీపీ హయాంలో జంతువుల నూనెతో లడ్డూ తాయారు చేశారని టీడీపీ వాళ్ళు లేదు ఇది కూటమి ప్రభుత్వంలో ఇలా జరిగింది అని వైసీపీ వాళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను వచ్చే బుధవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.
తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి వాస్తవాలు బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డూపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సర్కార్ చెప్పింది. దేవుడిపై తప్పుడు ప్రచారం ఏంటని వైసీపీ మండిపడుతోంది. కాగా తాజాగా వైసీపీ కోర్టును ఆశ్రయించడంతో దీనిపై ధర్మసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.