ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, విజయమ్మపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల తెలంగాణలో జోకర్, ఏపీలో విలన్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ సొంత ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు. జగన్ ను ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు విజయమ్మ అంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్న ఎంతో మంది నాయకులను నాశనం చేస్తున్నారు. మీరు చేసే పనులు ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డిని విజయమ్మ, షర్మిళ ఏం చేయాలనుకున్నారో అర్థం కావడం లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాలకోసం జగన్ ను నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టొద్దు. జగన్ ఏ రోజు స్వప్రయోజనాలు చూసుకోలేదు. మీరు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రస్పుటంగా అర్ధమైందని కేతిరెడ్డి అన్నారు.