పవిత్ర తిరుమలలో ఇవేం పిచ్చిపనులు..

thirupahi-4.jpg

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సినిమా పాటలకు డాన్సులు వేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. వాటిని రీల్స్ రూపంలో ఇన్ స్ట్రా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌లో పెడుతున్న యువతీ యువకులు తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యే దివ్వల మాధురి ఫొటోషూట్‌ మైన్స్‌ వ్యాపారి ఫోటోషూట్ వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది.

నాలుగు రోజుల క్రితం తిరుమల ఘాట్ రోడ్‌లో సెల్ఫీలు, ఫోటోలు వీడియోలు కోసం కొందరు యువకులు కారు డోర్లు తీసి హంగామా చేయడం కూడా భక్తులను ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు తిరుమలలో రీల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి టోల్ గేట్, తిరుమల ఆలయం ముందు, మాడ వీధుల్లో సినిమా పాటలకు ఎంజాయ్ చేసిన యూత్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెట్టడం వివాదాస్పదంగా మారింది.

Share this post

scroll to top