దేశద్రోహి జ్యోతి వ్యూహాత్మకం మౌనం..

jyothi-21.jpg

ఫెడరల్ యాంటీ-టెర్రర్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇది NIAలో ఓభాగం. గూఢచర్యం వంటి తీవ్రమైన కేసులను ఈజీగా సాల్వ్ చేసిన రికార్డ్ ఉంది. అలాగే దీని దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. విచారణ తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. సాక్ష్యాలు సేకరించడంలో నిపుణులు. డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలను లోతుగా పరిశీలిస్తారు. నిందితులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి నిజాలు రాబడతారు. ముఖ్యంగా డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ట్రాకింగ్, ఎన్‌క్రిప్టెడ్ సందేశాల విశ్లేషణలో నిపుణులు. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో జ్యోతి పంపిన సమాచారాన్ని డీకోడ్ చేసే సామర్థ్యం ఈసంస్థకు ఉంది. జ్యోతి వీడియోల్లోని ప్యాటర్న్‌లను, జియో-లొకేషన్ డేటాను లోతుగా పరిశీలిస్తారు. ISI అధికారులతో జ్యోతి చాట్‌లను, ఫోన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్విస్టిగేషన్‌ రంగంలోకి దిగితే జ్యోతి నిజాలు చెప్పే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈసంస్త దర్యాప్తు వేగంగా, కచ్చితంగా ఉంటుంది. అలాగే జ్యోతి నోట్స్‌లో ISI అధికారులతో సమావేశాల వివరాలు, సైనిక స్థావరాల స్కెచ్‌లు ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఫెడరల్ యాంటి టెర్రరిస్ట్ టీమ్‌ రంగంలోకి దిగితే, పాకిస్థాన్‌లోని ISI నెట్‌వర్క్, ఆమె ఆర్థిక లావాదేవీల వివరాలు తెలిసే అవకాశం ఉంది. జ్యోతి కేసు భారత భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా మారింది. జ్యోతి నిజాలు చెప్పకపోతే ISI నెట్‌వర్క్, మనదేశంలో వారి ఏజెంట్ల గురించి సమాచారం బయటకు రాకపోవచ్చు. గత రెండు వారాల్లో దేశంలో మొత్తం 14 మందిని గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేశారు, ఇంకా ఎంతమంది ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. అందుకే ఫెడరల్ యాంటి టెర్రర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను రంగంలోకి దింపాలని కేంద్రం భావిస్తోంది.

Share this post

scroll to top