ఫీజు రీయింబర్స్ మెంట్ మూడు దఫాలుగా పెండింగ్‌..

ys-jagan-07-2.jpg

ఫీజు రీయింబర్స్ మెంట్ మూడు దఫాలుగా పెండింగ్‌లో పెట్టారని విద్యార్థులు రోడ్డెక్కుతున్న పట్టని పరిస్థితి ఉందన్నారు. విద్యా వ్యవస్థ గాడి తప్పిందని టోఫెల్, CBSE, ఇంగ్లీష్ మీడియం వంటి పనులు అన్నీ పక్కన పెట్టేశారన్నారు. అమ్మ ఒడి గాలికి ఎగిరి పోయిందన్నారు. ఆరోగ్య శ్రీ, 108, 104 నిధులు చెల్లింపులు లేవని జగన్‌ పేర్కొన్నారు.లక్షన్నర పెన్షన్‌లు తొలగించారన్న ఆయన కొత్త పెన్షన్ల నమోదు కార్యక్రమం చేపట్టలేదన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు వైఎస్ జగన్. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని 5 నెలల కాలంలో 95 మంది మహిళలు, పిల్లల మీద అత్యాచారాలు జరిగాయన్నారు. అందులో 7 మంది చనిపోయారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి ఈ పనులు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. తెనాలిలో సహానా అనే యువతిపై టీడీపీ రౌడీషీటర్ దాడి చేసి హత్య చేశాడని అన్నారు. శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అధికార పార్టీ నేతల కుమారులు అత్యాచారం చేశారని పేర్కొన్నారు.

Share this post

scroll to top