వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అదేశాల మేరకు పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులను నియమించారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్ నియామకం..
