వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌లో తృటిలో ప్రమాదం తప్పింది.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం వెళ్లారు జగన్.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు.. ఇక, కడప విమానాశ్రయం నుండి పులివెందుల వెళ్తుండగా.. జగన్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.. నరసరామ్ పల్లి సమీపంలో వైఎస్ జగన్ చూసేందుకు ఎగబడ్డారు ప్రజలు. దీంతో.. ఆకస్మికంగా జగన్ కాన్వాయ్ ఆపాల్సి వచ్చింది.. ఈ సమయంలో.. కాన్వాయ్ లో ఉన్న ఫైరింజన్ వాహనాన్ని ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది.. అయితే, జగన్ కాన్వాయ్‌లో జరిగిన ప్రమాదంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా? ఇంకా ఏం జరిగింది అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జగన్ కాన్వాయ్‌లో తృటిలో తప్పిన ప్రమాదం..
