ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఫైర్ అయ్యారు. మీకే అంత కోపం వస్తే నాకెంత కోపం రావాలి అన్నారు. అమ్మ విజయమ్మ కారు ప్రమాదంపై సిగ్గులేని రాతలు రాశారని జగన్ మండిపడ్డారు. అమ్మ లెటర్ కూడా ఫేక్ అన్నారని, చివరికి వీళ్ల మోసాలు చూస అమ్మ నేరుగా వీడియో విడుదల చేశారన్నారు. ఫేక్ న్యూస్ రాస్తున్న టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని జగన్ ప్రశ్నించారు.
డీజీపీ లోకేష్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. కడప ఎస్పీకి తన భార్య ఫోన్ చేసిందని ఆంధ్రజ్యోతి రాసిందిని, మరి రాధాకృష్ణను బొక్కలో వేయండని జగన్ కోరారు. పోలీసులు సెల్యూట్ మూడు సింహాలకు కొట్టాలని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడం కించపరచడమే అవుతుంది తెలిపారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని, మీరు చేసే పనులు పోలీస్ డిపార్ట్మెంట్ పరువుపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.