తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, కార్యకర్తలతో జగనన్న కార్యక్రమంపై జగన్ ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.