వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25, 26వ తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. మంగళవారం రాత్రి తన నివాసంలో బస చేస్తారు. ఈనెల 26వ తేదీన బుధవారం ఉదయం 9.50 గంటలకు మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పట్టణంలోని గుంత బజార్‌లో వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్‌కు చేరుకుని ప్రారంభిస్తారు.
కడప జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన..
