ఐదుగురు చిన్నారుల‌ మృతిపై వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి..

ys-j-14-.jpg

వైయ‌స్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లె చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందడంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు చరణ్‌ (15), పార్ధు (12), హర్ష (12), దీక్షిత్‌ (12), తరుణ్‌ యాదవ్‌ (10) వేసవి సెలవులు కావడంతో గ్రామంలోని చెరువు వద్దకు ఈతకు వెళ్ళి మృత్యువాత పడటంపై ఆయ‌న తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్ర‌భుత్వం ఆదుకోవాలని వైయ‌స్ జ‌గ‌న్‌ కోరారు.

Share this post

scroll to top