నేడు వీరజవాన్‌ కుటుంబానికి వైయ‌స్ జగన్‌ పరామర్శ..

ys-jagan-13.jpg

జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్‌ సిందూర్‌లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు. ఆయన బెంగళూరు నుంచి ఉదయం 11.30 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంటారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించి, తిరిగి బెంగళూరుకు పయనమవుతారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన  వైయస్‌ జగన్..కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

Share this post

scroll to top