వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గుర్ల చేరుకుని, గ్రామంలో ఇటీవల డయేరియాతో మరణించిన వారి కుటుంబాలను, డయేరియా బాధితుల్ని పరామర్శించనున్నారు. డయేరియా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితుల్ని అడిగి తెలుసుకోనున్నారు. అలాగే చికిత్స సంబంధిత వివరాలపై ఆరా తీయనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం కు చేరుకుని, తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన..
