కడప స్టీల్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టు అంటూ వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు పేల్చారు. కడప కలెక్టర్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కి కొబ్బరి కాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలా రెడ్డి కడప స్టీల్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టు అంటూ చురకలు అంటించారు. ముఖ్యమంత్రులు మారడం, కొబ్బరి కాయలు కొట్టడం ఇదే తంతు అయిందని వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహించారు. 2019 లోఎన్నికల కోసం కడప స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు.
కడప స్టీల్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టు..
