వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు..

ys-sharmala-02.jpg

ముస్లిం మత స్వేచ్ఛను హరించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతోందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇవాళ ఆమె వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పై ‘X’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ మైనారిటీలను అణిచివేసే కుట్రేనని రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అంటూ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే నియంతలు చంద్రబాబు, నరేంద్ర మోడీ అజెండా అని కామెంట్ చేశారు. పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రావడం దేశంలో ఇవాళ బ్లాక్ డే అని చరిత్రలో ఇదో మాయని మచ్చగా మిగిలిపోయే దుశ్చర్య అని ఫైర్ అయ్యారు.

ఈ బిల్లుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పా మరొకటి కాదని అన్నారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడం కోసమే ఈ పన్నాగమని ధ్వజమెత్తారు. దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలు, దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర అని అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా.. వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించడం, వక్ఫ్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించడం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్లేగా ఎవరి అధీనంలో ఉంటే వారివే అనడం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగడం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే ఐదేళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలని నిబంధన పెట్టడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలేనని షర్మిల ఆరోపించారు.

Share this post

scroll to top