కృష్ణా గుంటూరు ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక బ‌హిష్క‌రిస్తున్నాం..

nani-07.jpg

కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికను ధ‌ర్మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించే ఛాన్స్ లేక‌పోవ‌డంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో కృష్ణా, గుంటూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ నేత‌లు స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యాన్ని వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు  పేర్కొన్నారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ను ప్ర‌భుత్వం ధ‌ర్మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించే ప‌రిస్థితి లేదు.  అప్ర‌జాస్వామికంగా పాల‌న సాగిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ త‌ప్పుడు పోక‌డ‌ల‌ను నిర‌సిస్తూ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్నాం. ప‌క్ష‌పాతం లేకుండా నిష్ప‌క్ష‌పాతంగా, ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఓట‌రు ఓటు వేసుకునే ప‌రిస్థితి లేదు. కృష్ణా, గుంటూరు, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల పార్టీ ఇన్‌చార్జులు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణ‌యాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంగీక‌రించార‌ని, ఈ దుర్మార్గ వాతావ‌ర‌ణంలో ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌రుగ‌వు కాబ‌ట్టి ఎన్నిక‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్ని నాని వెల్ల‌డించారు. 

Share this post

scroll to top