మరింత దూకుడుగా వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట..

ys-jagan-14-.jpg

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులు ఉద్య‌మ బాట పట్టాయి. నిన్న  రాష్ట్ర‌వ్యాప్తంగా అన్నదాతకు అండగా నిర్వ‌హించిన‌ కార్యక్రమం సూపర్‌ సక్సెస్‌కావడంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ శ్రేణుల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌ పిలుపు ఇస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని వైయ‌స్‌ జగన్‌, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు.  తొలి విడతగా రైతులు, కరెంట్‌ ఛార్జీలు, స్కూల్‌ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.

Share this post

scroll to top