సోషల్‌ మీడియా వేదికగా పార్టీ నేతలు శ్రేణులకు వైసీపీ కీలక సూచనలు..

ys-jagan-28.jpg

రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడల్లా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. దీనిపై పలు సందర్భాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పార్టీ శ్రేణులకు వైసీపీ కీలక సూచనలు చేసింది. డైవర్షన్‌ పాలిటిక్స్ తిప్పికొడదాం ప్రజా గొంతుకై నిలుద్దాం అంటూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. జగన్‌ ఇంతే చేశాడు మేం అంతకన్నా ఎక్కువ చేస్తామంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది.

కానీ, అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, అంతకుముందు అమల్లో ఉన్న పథకాలను ఎత్తివేయడమే కాదు, కొత్తగా వారు చెప్పిన ఒక్క పథకమూ అమలు చేయడంలేదు, కొత్తగా ప్రజలకు చేసింది ఏమీ లేదు. అన్నిరంగాల్లో తిరోగమనమే కనిపిస్తోంది. మరోవైపు మహిళలకు రక్షణకూడా లేని పరిస్థితులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం, సూపర్‌ 6- సూపర్‌ 7లు మోసాలే అయిన పరిస్థితులు, విద్య, వైద్యం, వ్యవసాయం, డోర్‌డెలివరీ గవర్నెన్స్‌ ఇలా అన్నీ పడకేసిన పరిస్థితులు, వీటికితోడు ఉచిత పంటలబీమాకు మంగళం, కరెంటు ఛార్జీల బాదుడు. ఓవైపు ఇవి చేస్తూ మరోవైపు ఇసుక , లిక్కర్‌ స్కాం, వరద సహాయంలో అంతులేని అవినీతికి పాల్పడుతోంది అని పేర్కొంది.

Share this post