పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా? చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలంటూ వైయస్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు రూ.4 కోట్లు అవినీతికి పాల్పడ్డారని.. పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దెల పేరుతో మరికొంత కొట్టేయటానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనంతటికీ కారకుడు. దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి జీవోలు జారీ చేయించుకుంటున్నారు. కాంట్రాక్ట్ పూర్తయితే మళ్లీ పది శాతం పెంచి సదరు కాంట్రాక్టర్ కు కాంట్రాక్టు ఇవ్వాలి. రెండు కోట్లకు పైగా సొమ్ము కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదు? పైగా నాలుగు నెలల పాటు భక్తుల నుండి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారు అని పోతిన మహేష్ ధ్వజమెత్తారు.