జాతీయ ఎస్సీకమిషన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు..

amabadhakar-14.jpg

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు,  సీసీ కెమెరాలు ఆపేసి అంబేద్కర్‌ విగ్రహంపై దాడికి పాల్ప‌డ్డార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధుల బృందం జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది. బుధ‌వారం న్యూఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను  వైయ‌స్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద టీడీపీ శ్రేణుల దాడిపై నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు నేతలు కమిషన్‌ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. 

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు,  సీసీ కెమెరాలు ఆపేసి అంబేద్కర్‌ విగ్రహంపై దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీకమిషన్‌ చైర్మన్‌ను కలిసిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఏ. సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎంఎల్సీ అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులున్నారు. 

Share this post

scroll to top