కిడ్నాప్‌ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ..

kidnap-04.jpg

తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, కిడ్నాప్‌ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ క్లారిటీ ఇచ్చారు. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అనారోగ్యంగా కారణంగా ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే వస్తాను. అయితే, నా ఆరోగ్యం గురించి గానీ, నేను కిడ్నాప్‌నకు గురయ్యాననే వార్తలపై గానీ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని ప్రజలు, అధికారులు, మీడియాకు విడుదల చేసిన ఆ వీడియోలో పేర్కొన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం.

Share this post

scroll to top