చంద్రబాబు కక్షసాధింపులకు భయపడేది లేదు..

mithun-12-.jpg

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా మాపైన కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలకు భయపడేది లేదని వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు మాపై చేసిన వరుస ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజమని వారి దర్యాప్తులో నిరూపించలేక పోయారని అన్నారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ వైయస్ జగన్ గారికి అండగా నిలుస్తున్న నేతలను దెబ్బతీయాలనే లక్ష్యంతో రాజకీయంగా చేయిస్తున్న ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని అన్నారు. 

Share this post

scroll to top