కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో దుర్మరణం చెందిన విశాఖ వాసి, ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ జెఎస్ చంద్రమౌళి కుటుంబాన్ని, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్‌రావు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ముష్కరుల చేతిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ..
