వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్‌కు బెంగుళూరులో ఇల్లు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారని వెల్లడించారు. వివాహం అయినా తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు. జగన్ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందాడన్నారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు తండ్రిగా దూరంగా ఉంటు బెంగుళూరులో వ్యాపారం చేసుకున్నారని చెప్పారు. రఘురాం సిమెంట్ కొని భారతి సిమెంట్స్ ఏర్పాటు చేసుకున్నారన్నారు.
షర్మిల ఆస్తుల్లో జగన్ వాటా అడగలేదన్నారు. చెల్లి కోసం జగన్ సొంత ఆస్తుల్లో కూడా వాటా ఇచ్చారన్నారు. జగన్ వ్యాపారాల్లో షర్మిల ఎక్కడైనా డైరెక్టర్‌గా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. చెల్లెలు మీద ప్రేమతో సొంత ఆస్తులు ఇచ్చారన్నారు. వైయస్ మరణం తర్వాత ప్రేమతో షర్మిలకు ఆస్తులు ఇచ్చారని తెలిపారు. కోర్టు కేసులు తెగిన తర్వాత కొన్ని ఆస్తులు ఇస్తానని చెప్పారన్నారు. జగన్ ఎదుగుదల చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు, చంద్రబాబు కుటుంబ సభ్యులు అవినీతి చేయలేదని గుండెమీద చెయ్యి వేసి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.