టీడీపీకి కుటుంబ తగాదాలపై ఎందుకంత ఆసక్తి..

sharmila-26-.jpg

కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌ వేదికగా కుటుంబ తగాదాలపై టీడీపీకి అంత ఆసక్తి ఎందుకు? వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి కి, ఆయన సోదరి షర్మిలమ్మ రాసిన లేఖని టీడీపీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్‌లో బిగ్ బ్లాస్ట్ అంటూ పోస్ట్ చేసి ఈ గొడవని రెచ్చగొట్టి, నాణేనికి ఒకవైపే చూపించి ప్రజలను పక్కదోవ పట్టించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?

దీన్ని ఆసరాగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి దిగాలనే లక్ష్యం కాదంటారా?. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఘోరమైన పాలనా వైఫల్యం నుంచి ఆగ్రహంతో ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌ కాదా? దిగజారుతున్న లా అండ్‌ ఆర్డర్‌తో కడతేరుతున్న ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాల నుంచి, డయేరియా మరణాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ తప్పుడు రాజకీయాలు కాదా? రాజకీయంగా వైయ‌స్‌ జగన్‌ అంతాన్ని కోరుకుంటున్నవారితో తన వంతు పాత్ర పోషిస్తున్న ఘట్టం నేపథ్యంలో, ప్రజలకు అన్ని వాస్తవాలు తెలిసేలా వైయ‌స్‌ జగన్‌ తన సోదరికి రాసిన అన్ని లేఖలను, తన స్వార్జిత ఆస్తుల్లో ఇవ్వదలుచుకున్న ఆస్తుల వివరాలతో కూడిన MOUనుకూడా వెల్లడిస్తున్నాం. తప్పుడు ప్రచారాలు, వక్రీకరణలు కాకుండా వాస్తవాలకు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో విడుదల చేస్తున్నాం’ అని తెలిపింది. 

Share this post

scroll to top