కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సులు కితకితలాడుతున్నాయి. రద్దీగా ఉంటున్నాయి. అయితే మహిళల ఉచిత బస్ స్కీమ్‌లో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కండక్టర్లు చేతివాటం చూపిస్తున్నారు. దీంతో వారికి కాసుల వర్షం కురుస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. కొంత మంది కండక్టర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. పురుషులు తీసుకునే టికెట్‌ను కూడా మహాలక్ష్మి పథకం కింద వేసేస్తున్నారు. అంటే మగ వారికి కూడా ఫ్రీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కండక్టర్లకు డబ్బుల వర్షం కురుస్తోంది. కండక్టర్లు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రయాణికులు ఇదేంటని అడిగితే పొరపాటున ఇచ్చానంటూ కండక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. జీరో టికెట్ చించి మరో టికెట్ ఇస్తున్నారు. ఇక ఎవరూ అడగకపోతే ఆ డబ్బులు వారి జేబుల్లోకే వెళ్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక ఘటనను గమనిస్తే ఓ ప్రయాణికుడు జూన్ 26న కొత్తపేట్ నుంచి సరూర్‌నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. దీంతో అతడికి కండక్టర్ మహిళలకు ఇచ్చే ఫ్రీ టికెట్ ఇచ్చాడు.
మహిళల ఉచిత బస్ స్కీమ్ అమలులో అదిరే ట్విస్ట్..
