Tag Archives: ap cm jagan

పార్టీ జెండాను గుండెగా మార్చుకున్న యోధులకు నా సెల్యూట్‌

13 ఏళ్ల క్రితం పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణలో.. నాన్న గారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం, అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి, వెన్నుదన్నుగా నిలిచి.. మన పార్టీ జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్‌ ప్రేమ పూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యులుగా సెల్యూట్‌ చేస్తున్నా’’ అని వైయస్‌ఆర్‌ ...

Read More »

రేపు, ఎల్లుండు కడపలో జగన్‌ పర్యటన

జూలై 7, 8న వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్  రేపు పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎంజూన్ 8న ఉదయం వైఎస్సార్‌కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి,అనంతరం విజయవాడ చేరుకుని పార్టీ ప్లీనరీలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ పర్యటన

వరద బాధితులతో నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది  వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.​ వరదలతో చాలా నష్టం జరిగిందనే విషయాన్ని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్‌ కొనియాడారు.

Read More »

తుఫాన్‌ బాధితులను ఆదుకుంటాం : జగన్మోహన్‌ రెడ్డి

జవాద్‌ తుపాన్‌ వల్ల ధన, ప్రాణ నష్టం కలిగిన బాధితులకు వెంటనే నష్ట పరిహారమివ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాన్‌ కారణంగా రాజంపేట నియోజవర్గంలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌,పించ ప్రాజెక్ట్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంటకట మల్లికార్జునరెడ్డి సిఎం జగన్మోహన్‌రెడ్డికి వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే నష్ట పరిహారంతో పాటు,పించ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కు సంభందించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ...

Read More »

వైసిపిలో ఎమ్మెల్యేలుగా ఓడిన వారందరికీ నామినేటెడ్‌ పదవులు

రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. 2019లో జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరపున పోటీచేసి ఓడినవారికి ఈ నామినేషన్‌ పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఓటమి పాలైన 24మందికి నామినేటెడ్‌ పదవులు వరించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎన్నికల అనంతరం ఈ 24మందిలో కొంతమందిని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తవారికి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఓడినవారికా, లేక ప్రస్తుతం పార్టీ సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్న వారికా అన్న విషయం తేలాల్సి వుంది. ...

Read More »

9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై క్రిమినల్‌ కేసులు

కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడిన 9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై ఎపి సర్కార్‌ క్రిమినల్‌ కేసులను నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి 15 ఆసుపత్రులను తనిఖీ చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తాజాగా 9 ప్రైవేటు ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది.  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ… అవకతవకలకు పాల్పడిన తొమ్మిది ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ...

Read More »

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన జగన్‌

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సిఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో గురువారం ప్రారంభించారు. పక్కా ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా.. మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదని, పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. తొలి ...

Read More »

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో జగన్‌

విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బుధవారం పాల్గొని రాజశ్యామల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సిఎం దర్శించుకున్నారు. పీఠం ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రాజశ్యామల యాగంలో సిఎం జగన్‌ పాల్గొన్నారు. రాజశ్యామల యాగం విశిష్టతను స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సిఎం జగన్‌ కు తెలిపారు. పీఠంలో సుమారు గంటసేపు సిఎం గడిపారు. ఈ కార్యక్రమంలో పీఠం లోనే అమ్మవారి ప్రసాదాన్ని సిఎం స్వీకరించారు. పీఠంలో నిర్వహించే ...

Read More »

ఫిబ్రవరిలో అన్ని తరగతులు!.. అధికారులకు జగన్‌ ఆదేశం

ఫిబ్రవరి ప్రథమార్ధంలో అన్ని తరగతులకూ పాఠశాలలు తెరిచే విషయంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రోజువారీ తరగతుల నిర్వహణపై కూడా ఆలోచన చేయాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖపై సిఎం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పిల్లలు పాఠశాలకు రాకపోతే తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, గ్రామ వాలంటీర్‌తో యోగక్షేమాలు కనుక్కోవాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్‌ ...

Read More »

చల్లా కుటుంబాన్ని పరామర్శించిన జగన్

కరోనాతో ఇటీవల మృతి చెందిన దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకులోని చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లిన సీఎం జగన్.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మండలి విప్ గంగుల ప్రభాకర్ ...

Read More »