ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. జాతీయ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా, స్థానిక సర్వేలు మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించాయి. అయితే స్థానికంగా చేసిన ఆరా సర్వేనే మెజార్టీ ప్రజలు నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఆయన గతంలో చేసిన సర్వేలన్నీ కూడా విజయవంతం అయ్యాయి.
ఆరా మస్తాన్ మరోసారి ఏపీలో జగన్ పార్టీదే విజయం అని తేల్చి చెప్పారు. తాజాగా ఆరా మస్తాన్ వైసీపీ గెలుస్తుందని చెప్పిన 104 స్థానాలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.