ఈ నెలలో అమరావతి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ..

modi-12-.jpg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ నెలలో అమరావతి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. సిఆర్డిఏ తరఫున పర్యవేక్షణకు నోడల్ అధికారి నియామకం కూడా అయినట్లు సమాచారం. ఈ మేరకు బిజెపి క్యాడర్ను ఆంధ్రప్రదేశ్ బిజెపి కూడా అలర్ట్ చేసింది. మోడీ బహిరంగ సభ కూడా ఉండనున్నట్లు సమాచారం అందుతుంది. ఇందులో కూటమి అగ్ర నేతలు చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top