కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీ విజయశాంతి కుటుంబానికి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలంగా మారింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేదంటే వారి అంతూ చూస్తానని చంద్ర కిరణ్ రెడ్డి అనే వ్యక్తి విజయశాంతి భర్తకు మెసేజ్‌లు పంపాడు. దీంతో అప్రమత్తమైన విజయశాంతి, ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. డబ్బుల కోసం తమను బెదించించిన వ్యక్తి పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై దర్యాప్తు ప్రారంభించారు.
ఎమ్యెల్సీకి బెదిరింపు మెసేజ్‌లు చేసిన వ్యక్తి గతంలో విజయశాంతి సోషల్ మీడియా పేజీలను మెయింటెన్ చేసేవాడు. ఈ క్రమంలోనే అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు. కాగా ఇటీవల ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అతన్ని పక్కకు పెట్టారు. దీంతో నింధితుడు తనకు ఇంకా డబ్బులు ఇవ్వాలని, లేదంటే మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.