టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అటు మిగతా భాషల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో విడుదలైన చిత్రాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి మంచి వసూళ్లు రాబట్టాయి. స్టార్ హీరోస్ పెద్ద చిత్రాల నుంచి చిన్న సినిమాలు, ఒకప్పుడు డిజాస్టర్స్ అయిన మూవీస్ కూడా మళ్లీ విడుదలై విజయాన్ని అందుకున్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ నటించిన అన్ని చిత్రాలు మరోసారి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్ రీరిలీజ్ రూపంలో ప్రేక్షకులను మరోసారి అలరించాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ అయిన చక్రం సినిమాను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
రీరిలీజ్ కానున్న ప్రభాస్ ప్లాప్ మూవీ
