లక్ష కోట్లకు పైగా పనులకు ప్రధాని శ్రీకారం..

cbn-02-1.jpg

అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తం రూ.1,07,002 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. రూ.49,040 కోట్ల రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు రూ.57,962 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్‌ పద్ధతిలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.58 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోడీ జాతికి అంకితం చేస్తారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధాన పథకాల కల్పనలో భాగంగా ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఒక రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు.

11,240 కోట్ల వ్యయంతో శాసనసభ, హైకోర్టు, సచివాలయంతో పాటు ఇతర పరిపాలన భవనాలు, 5,200 కుటుంబాలకు గృహవసతి నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతుంది. కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో సుమారు రూ.1,500 కోట్లతో నిర్మించే మిస్సైల్‌ టెస్ట్‌ రేంజ్‌, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్‌, రూ.293 కోట్లతో గుంతకల్లు వెస్ట్‌ నుంచి మల్లప్ప గేట్‌ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టు,రూ.3,176 కోట్ల విలువైన నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. రూ.3,680 కోట్ల విలువైన పలు జాతీయ రహదారి పనులు, రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట-విజయవాడ 3వ లైన్‌, గుంటూరు-గుంతకల్లు డ బ్లింగ్‌ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనప ల్లి, కేయీఎఫ్‌ పాణ్యం లైన్‌ల ప్రారంభోత్సవం చేస్తారు మోడీ.

Share this post

scroll to top