వనజీవి రామయ్య మృతి ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి..

ys-jagan-12-.jpg

ప్ర‌కృతి ప్రేమికుడు, ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త‌, ప‌ద్మ‌శ్రీ వనజీవి రామయ్య మృతి ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.  ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ‌ ప‌రిర‌క్ష‌ణ‌కు ఆయ‌న చేసిన కృషి మ‌రువ‌లేనిది. కోటి మొక్క‌ల‌కుపైగా నాటి పుడ‌మి త‌ల్లికి ఆయ‌న అందించిన సేవ‌లు రేప‌టి త‌రానికి స్ఫూర్తిదాయ‌కం. వ‌న‌జీవి రామ‌య్య ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్థిస్తూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళులర్పించారు.

Share this post

scroll to top