రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న వృథా ఖర్చులపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే లక్ష్యంతో పేర్లను మార్చుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పేరును టీఎస్(తెలంగాణ స్టేట్)గా మార్చిన విషయం తెలిసిందే. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీఎస్‌ను టీజీగా మార్చేసింది. అయితే ఒక్క అక్షరం మార్పు కోసం అక్షరాల రూ. 1000 కోట్ల ఖర్చా అంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.