ఏపీఎస్‌ ఆర్టీసీలో 1400కొత్త బస్సులు..

free-bus9.jpg

ఏపీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 1400 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ప్రయాణీకులకు భద్రత, సుఖప్రయాణం ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఆగస్ట్‌ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రారంభించనున్న నేపథ్యంలో విజయవాడలో ఆర్టీసీ బస్‌ భవన్‌లో అధికారులు, కార్మిక సంఘాలతో సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నిలిచిపోయిన కారుణ్య నియామకాలపై అధికారులతో చర్చించినట్టు చెప్పారు. ఏపీఎస్‌ ఆర్టీసీ చిన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని వర్గాల ప్రజలతో అనుసంధానమై ఉందని, సంస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మంత్రివ రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. కార్మికులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు.

Share this post

scroll to top