ఎల్లుండి రుణమాఫీ.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు

ravanth-16-2.jpg

ఈ నెల 18న రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని కలెక్టర్లతో జరిగిన సదస్సులో తెలిపారు. అదే రోజు రైతు వేదికల్లో సంబరాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం వరకు (రూ.2 లక్షల వరకు) రుణాలను సర్కార్ మాఫీ చేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి.. నోడల్ అధికారి నేతృత్వంలో రూ.2లక్షల రుణమాఫీ అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. రేషన్ కార్డు ప్రమాణికంగా ముందుగా స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది.. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ప్రమాణికంగా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. 

Share this post

scroll to top