4 నగరాలే లక్ష్యంగా 500 డ్రోన్లతో పాకిస్తాన్ దాడి..

pa-09.jpg

దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌పై దుష్ట పన్నాగానికి పాల్పడింది. అయితే, భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ దాడిని తిప్పికొట్టింది. మే 8 రాత్రి, 8 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పాకిస్తాన్ ఏకంగా భారత్‌పైకి 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకుని చిన్న డ్రోన్లను మోహరించిందని తెలిసింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణుల్ని L70, ZU-23, షిల్కా మరియు ఆకాష్‌లతో సహా క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ ఎక్కువగా నిరాయుధమైన డ్రోన్లను పంపడం వెనక ఉద్దేశ్యం ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేయడం లేదా భారత సైనిక స్థావరాల నిఘా సేకరించే ప్రయత్నం అయి ఉండొచ్చని రక్షణ వర్గాలు అనుమానిస్తున్నా్యి.

హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసిన తరహాలో పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. పాక్ నుంచి 8 క్షిపణులు సత్వారీ, సాంబా, ఆర్ ఎస్ పురా, అర్నియాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పైకి వరసగా దాడులు చేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ప్రయత్నాలను మన సైన్యం భగ్నం చేసింది. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్ లోని 09 ప్రాంతాల్లో 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 100 మంది హతమయ్యారు.

Share this post

scroll to top