డీఎస్పీల బదిలీల్లోనూ వివక్ష రెడ్డి వర్గంలో ఒకరికీ దక్కని పోస్టింగ్ టీడీపీ కూటమి తీరుపై సర్వత్రా విమర్శలు టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తోంది. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట కక్షసాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను గురువారం బదిలీ చేసింది. వారిలో బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది.
15 మంది రెడ్డి డీఎస్పీలలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు..
