బుడమేరు రెగ్యులేటర్‌ గేట్లు ఎవరు ఎత్తారు? ఎందుకు ఎత్తారు..

ys-jagan-5.jpg

బుడమేరు రెగ్యులేటర్‌ గేట్లు ఎవరు ఎత్తారు? ఎందుకు ఎత్తారు?. ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇళ్లు మునిగిపోయేది. గేట్లు ఎత్తితే విజయవాడకే వస్తాయి. అనివార్య కారణాల వల్ల ఎత్తినట్లు వాళ్ల పాంప్లెట్‌ పేపర్‌ ఈనాడులోనే ఇవాళ ఆ విషయం రాశారు. జర్నలిజంలో నిజాయితీ ఉంటే ఆ వార్తను కూడా హైలెట్‌ చేయండి అని అక్కడి రిపోర్టర్లను కోరారాయన. విజయవాడ వరదలు ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ఘటన ఇదని, మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్స్‌  అని మరోసారి వైయ‌స్‌ జగన్‌ ఉద్ఘాటించారు. 

తుపాను రాబోతుందన్న విషయం చంద్రబాబుకు తెలియదా?. వాతావరణ శాఖ అలర్ట్‌ ఇచ్చినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారు. సీఎంగా ఉండి ఆయన చేయాల్సిన పనులేవీ చేయలేదు. వర్షాలు, వరదలతో 32 మంది మరణించారు. ఇంతమంది చావుకు చంద్రబాబే బాధ్యత. సీఎం పదవికి చంద్రబాబు అర్హుడేనా?. తప్పు చంద్రబాబు దగ్గరే ఉంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పి పరిహారం అందజేయాలి. చనిపోయిన వాళ్లకు రూ.25 లక్షల పరిహారం అందించాలి. ప్రతి ఇంటికి రూ.50 వేలు అందించాలి.

Share this post

scroll to top