బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొండవాలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. గోపాలపట్నం రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో విరిగిపడ్డ కొండచరియలు ఆ ప్రాంతవాసులను ఉలక్కిపడేలా చేశాయి. హనుమంత్వాక, ఎండాడ, తోటగురువు, మధురవాడ కొండవాలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయే స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు. వాయుగుండం ప్రభావంతో ఇవ్వాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విశాఖలో భారీ వర్షాలు..
