పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం వద్ద వరద నీరు భారీగా చేరడంతో ఆయన స్థలం అంత చెరువును తలపిస్తోంది. పవన్ కళ్యాణ్ స్థలం పక్కనే ఉన్నటువంటి ఏలేరు కాలువ ఉప్పొంగడంతో పవన్ కళ్యాణ్ స్థలంతో పాటు చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా నీటిమట్టమయ్యాయి. కాగా, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందుగానే 216 నేషనల్ హైవే పక్కన 3.52 ఎకరాల స్థలాన్ని కొన్నారు. అందులోనే పార్టీ కార్యాలయం, అతను ఉండడానికి ఇల్లు నిర్మించి స్థానికుడిగా పిఠాపురంలో ఉంటానని ప్రకటించారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
వరదలో పవన్ ఇంటి స్థలం..
