డ్యాన్సర్‌పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా ను గోవాలో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ నార్సింగి పోలీసులు ఆయనను నేరుగా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టు లో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు షేక్ జానీ బాషాకు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చర్లపల్లి జైలు కు తరలిస్తున్నారు. అదేవిధంగా జానీ మాస్టర్‌ను విచారించేందుకు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ ను వేయిబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, గతంతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తన వద్ద పని చేసిన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జానీ మాస్టర్‌కు రిమాండ్..
