రైతులకు శుభవార్త..

modi-26.jpg

పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్‌ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లుగా సంబంధిత పీఎం కిసాన్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.

రైతులు బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌, ఈ కేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్‌ చేసుకోవాలి. పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకున్న రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనం ఏ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలలో చేరేలా నిర్ధారించడానికి ఈ కేవైసీ ప్రవేశపెట్టబడింది.

Share this post

scroll to top